పంచ కట్టి.. బ్యాటు చేత పట్టి
20-03-2026 12:00 AM
బ్యాట్మెంటన్ ఆడిన రైతులు
నిర్మల్, మార్చి 19 (విజయక్రాంతి) : వాళ్లంతా వ్యవసాయ రైతులు. పొద్దున లేచి ఉగాదినాడు పంట చేల్లో వెళ్లి పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. పండుగ రోజు ఆటపాటలతో సందడి చేశారు. సారంగాపూర్ మండలంలోని కౌట్లకె గ్రామంలో రైతులు పంచ కట్టి చేతిలో బ్యాడ్మింటన్ దాటు పట్టుకుని బ్యాడ్మింటన్ క్రీడలు ఆడుతూ సందడి చేశారు. పోటీలు నిర్వహించి గెలుపొందిన వారి కి బహుమతులు అందించారు, రైతులు ఉగాది రోజు ఈతరహ క్రీడలు రావడం పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి.




