30 June, 2026 | 1:54 AM

దైవిక నేపథ్యం సినిమాతో..

30-06-2026 01:03 AM

స్టార్ హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో గతంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం ఘన విజ యం సాధించింది. ఇప్పుడు వీరి కలయికలో రాబోతున్న మరో భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం దైవిక నేపథ్యంతో రూపుదిద్దుకోనుంది.

పురాణాల స్ఫూర్తితో సాగే కథనం, లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠభరిత యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన సరికొత్త ప్రపంచ నిర్మాణంతో ఈ చిత్రం ప్రేక్షకులకు అపూర్వమైన అనుభూతిని అందించనుందని టీమ్ పేర్కొంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్రీకరణ షెడ్యూల్ తదితర వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.