జై భీమ్ దర్శకుడితో కొత్త చిత్రం ప్రారంభం
30-06-2026 01:05 AM
హోంబలే ఫిలమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ మరో కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. హీరో సూర్య, నటి కాయదు లోహర్, ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞానవేల్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించి ముహూర్త కార్యక్రమం సోమవారం చెన్నైలోని పార్క్ హయత్ హోటల్లో జరిగింది. చిత్రబృందంతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్; సినిమాటోగ్రఫీ: ఎస్‌ఆర్ కదిర్; ఎడిటర్: ఫిలోమిన్ రాజ్; ప్రొడక్షన్ డిజైన్: కే కదిర్.






