16 May, 2026 | 8:15 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావుకు శుభాకాంక్షలు

16-05-2026 07:31 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (బిసి సంక్షేమం, అభివృద్ధి శాఖ) నియమితులైన వి. హనుమంతరావుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, యంనంపేట్ గ్రామ శాఖ అధ్యక్షులు సహదేవ్ గౌడ్, పోలగోని లక్ష్మణ్ గౌడ్  మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.  హనుమంతరావు సేవలు, అనుభవం రాష్ట్రంలోని బిసి వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి మరింత దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో వెనుకబడిన తరగతులకు మరిన్ని సంక్షేమ ఫలాలు అందాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేయడం జరిగింది.