14 August, 2026 | 6:44 PM

గీతం ‘సెలెస్టియా 2026’తో ఫ్రెషర్స్ కు స్వాగతం

14-08-2026 05:38 PM

స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో స్నేహభావంతో నిండిన ఉత్సాహభరితమైన వేడుక

పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సెలెస్టియా 2026’ ఫ్రెషర్స్ పార్టీని ఆగస్టు 14న నిర్వహించింది. సంగీతం, నృత్యం, వినోదం, స్నేహభావంతో నిండిన ఉత్సాహభరితమైన వేడుకతో 2026-27 బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులను ఈ వేడుకతో స్వాగతం పలికింది. ఈ కార్యక్రమం ఫ్రెషర్స్ కు తమ సీనియర్లు, సహచరులతో కలిసి మాట్లాడటానికి, కొత్న స్నేహాలను పెంచుకోవడానికి, గీతం కమ్యూనిటీలో భాగం కావడానికి ఒక ఉత్సాహభరతిమైన వేదికను అందించింది.

ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆసక్తికరమైన ఆటలు, సంగీతం, అనేక సరదా కార్యకలాపాలతో ప్రాంగణం కళకళలాడుతూ, పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ గ్లామరస్ ర్యాంప్ వాక్. ఇక్కడ ఫ్రెషర్స్ తమ ఆత్మవిశ్వాసం, హుందాతనం, వ్యక్తిత్వం, శైలిని ప్రదర్శించారు. వారి ఉత్సాహభరితమైన భాగస్వామ్యం, ఉత్తేజకరమైన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గీతం నాయకుల చేతుల మీదుగా మిస్టర్ ఫ్రెషర్, మిస్ ఫ్రెషర్లకు సత్కారం చేయడంతో, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి. 

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ నాయకత్వం మాట్లాడుతూ... కొత్త విద్యార్థుల కోసం ఆసక్తికరమైన, స్వాగత పూర్వకమైన వేదికను ఏర్పాటు చేసినందుకు విద్యార్థి నిర్వాహకుల కృషిని అభినందించారు. ‘సెలెస్టియా 2026’ ఫ్రెషర్లకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడమే కాకుండా, వారిలో జట్టు స్ఫూర్తిని, స్నేహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, గీతం సమాజం పట్ల బలమైన అనుబంధ భావాన్ని పెంపొందించిందని వారు పేర్కొన్నారు. గీతంలో తమ విద్యా ప్రయాణానికి ఒక చిరస్మరణీయమైన ఆరంభాన్ని అందించినందుకు ఫ్రెషర్లు తమ సీనియర్లకు, నిర్వాహకులకు కృతజ్జతలు తెలియజేయడంతో ఈ వేడుకలు ఆనందంగా ముగిశాయి.