14 August, 2026 | 6:37 PM

నగర ప్రజలకు త్వరలోనే చాట్ బాట్ సేవలు

14-08-2026 05:41 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నగరపాలక సేవలు మరింత మెరుగు పరిచే చర్యలో భాగంగా త్వరలో అందుబాటులోకి వాట్సాప్ "చాట్ బాట్" కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పౌర సేవలను మరింత చేరువ చేసేందుకు నగరపాలక యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో  అధికారులు, సాంకేతిక బృందం సిబ్బందితో సమావేశం జరిగింది.

నగరపాలక సంస్థ అందిస్తున్న పలు రకాల పౌర సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందించేందుకు వాట్సాప్ "చాట్ బాట్" సాంకేతికత పై సుదీర్ఘంగా చర్చించారు. చాట్ బాట్ ద్వారా బుకింగ్, చెల్లింపుల ప్రక్రియ తదితర విషయాలకు సంబంధించిన డెమో ను కమీషనర్ వీక్షించి  పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో త్వరలోనే వాట్సాప్ " చాట్ బాట్" సేవలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు.

ప్రజలకు నిత్యం అవసరమయ్యే మంచి నీటి ట్యాంకర్ల బుకింగ్ తో పాటు సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ సేవలు, తదితర మరికొన్ని సేవలను నేరుగా వాట్సాప్ చాట్ బాట్ కి అనుసంధానం చేసేలా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. వాట్సాప్ మెసేజ్ ద్వారా హాయ్ అని టైప్ చేసి పూర్తి వివరాలు అందించి, రుసును చెల్లింపులు చేసేలా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. చాటా బాట్ విధానం పై అధికారులకు సూచనలు చేసి ఆదేశించినట్లు తెలిపారు. ​ఈ సమావేశంలో అదనపు కమీషనర్ ఆయాజ్, డీఈ దేవేంధర్, అధికారులు, సాంకేతిక బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.