16 May, 2026 | 8:14 PM

చిన్నారుల మరణాలపై జిల్లా అధికారుల సమీక్ష సమావేశం

16-05-2026 07:36 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  డా తుకారాం రాథోడ్ ఆదేశాల మేరకు, జిల్లా చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యూనిజేషన్ అధికారి డా ప్రతాప్ సమక్షంలో శనివారం రోజు, జిల్లా డి యం ఎచ్ ఓ కార్యాలయంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన చిన్నారుల మరణాలపై Child Death Review కార్యక్రమం నిర్వహించబడింది. సమావేశంలో చిన్నారుల మరణాలకు సంబంధించిన వివరాలను ,సమగ్రంగా పరిశీలించి, మరణాలకు దారితీసిన కారణాలపై విచారణ చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి మరణాలను నివారించేందుకు అవసరమైన చర్యలపై వైద్య అధికారులకు సూచనలు అందజేయబడినవి. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  మాట్లాడుతూ, మాతృ మరియు శిశు మరణాలను నివారించేందుకు ఆరోగ్య సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అలాగే గర్భిణీలు మరియు బాలింతలకు ప్రసవం అనంతరం పిల్లలు రెండు సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు ,నిరంతర ఆరోగ్య విద్య, పోషకాహార సూచనలు మరియు వైద్య సేవలపై అవగాహన కల్పించాలని వివరించారు.