14 August, 2026 | 6:44 PM

ప్రభుత్వ పాఠశాలలో కేబుల్ వైర్లు చోరీ

14-08-2026 05:35 PM

కారేపల్లి,(విజయక్రాంతి): సింగరేణి మండల కేంద్రంలో గల ప్రభుత్వ హైస్కూల్ పాఠశాల యందు ఆకతాయిలు పాఠశాల ముగిసిన తరువాత మరియు సెలవు దినాలలో వెనుక ప్రక్క ఉన్న గోడలపై నుంచి పాఠశాలలోకి దూకి సుమారు 50 మీటర్ల కరెంటు కేబుల్ ను దొంగలించారు, అంతేకాకుండా పైపులను పగలగొట్టి ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు. ఇలాంటి ఘటనలు పలుమార్లు జరిగి పాఠశాలకు విద్యుత్ అంతరాయాన్ని కలిగిస్తు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను కలుగజేస్తున్నారు.

ఈ విషయం పై  పాఠశాల హెడ్మాస్టర్ సాల్మన్ రాజు సర్పంచ్ మేదరి టోనీ, పంచాయతీ కార్యదర్శి నెహ్రుల దృష్టికి తీసుకువెళ్లగా వారు దొంగతనం జరిగినటువంటి ప్రదేశాలను పాఠశాల ఆవరణాన్ని పరిశీలించారు. అలాగే ఆకతాయిల ను గుర్తించి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక కారేపల్లి పోలీస్ స్టేషన్లో హెచ్ఎం సాల్మన్ రాజు ఫిర్యాదు చేశారు.