27 May, 2026 | 2:25 AM

పంటను కొంటారా.. చావమంటారా?

27-05-2026 12:00 AM
  1. నిర్మల్ జిల్లా స్వర్ణ గ్రామ రైతుల ఆవేదన
  2. చెట్లను నరికి రోడ్డుపై వేసి నిరసన 

నిర్మల్, మే 26 (విజయక్రాంతి): పంటలైనా కొనండి.. చావుకైనా అనుమతి ఇవ్వా లని నిర్మల్ జిల్లా స్వర్ణ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సారంగపూర్ మం డలం స్వర్ణ గ్రామ రైతులు మంగళవారం మక్కల కొనుగోళ్లు చేపట్టాలని ఆందోళన నిర్వహించారు. స్వర్ణ-నిర్మల్ రహదారిపై చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేసి, పంట సంచులను రోడ్డుపై పోసి రాస్తారోకో చేశారు. పంట చేతికొచ్చి నెల రోజులైనా కొనుగోళ్లు చేపట్టకపో వడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.

ప్రభుత్వం, పాలకులు పట్టించుకోవడం లేద ని ధ్వజమెత్తారు. పంటనైనా కొనాలని లేదం టే చావుకు అయినా అనుమతి ఇవ్వాలని ఆక్రోశం వెళ్లగక్కారు. కాగా నిర్మల్ జిల్లా కేం ద్రంలోని కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద వెల్మల్ బొప్పారం గ్రామానికి చెందిన సుమారు 100 మంది రైతులు బైఠాయించి అధికారులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

దీంతో జెసి కిషోర్ కుమార్ అక్కడికి చేరి రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కడెం ఖా నాపూర్ లక్ష్మణ్ చందా మండలాల్లో కూడా రైతులు ఆందోళన నిర్వహించారు. కాగా కుంటాల కుబీర్ నర్సాపూర్‌లో కేశ్వరం తదితర మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల ధాన్యం తడిసింది.