27 May, 2026 | 1:37 AM

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

27-05-2026 12:00 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, మే 26,(విజయక్రాంతి)వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదు ట రాజరాజేశ్వరి దేవి మహిళా స్వశక్తి సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి మెప్మా క్యాంటీన్ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఇలాంటి క్యాంటీన్లను ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు క్యాంటీన్లో స్వయంగా భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. తక్కువ ధరకే నాణ్య మైన భోజనం అందించడం ద్వారా పేద రోగులు, భక్తులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.