27 February, 2026 | 4:08 AM

ఉన్నవాటిని కూలగొడతారా?

27-02-2026 12:09 AM
  1. రెండున్నరేళ్లలో పేదలకు కొత్తగా ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా?

రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలి

ఎంపీ ఈటల రాజేందర్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 26(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వ చ్చి రెండున్నరేళ్లవుతు న్నా పేదలకు భూములు, ఇళ్లు ఇవ్వకుండా ఉన్నవాటిని కూలగొడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరుతో వందలాది ఇళ్లను నేలమట్టం చేస్తున్నారని, మధుపార్క్ వంటి అపార్ట్‌మెంట్లలో నివసించే వారి ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా అని నిలదీశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు న్నరేళ్లు గడుస్తున్నా, పేదలకు కొత్తగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా, ఉన్న నీడను లా క్కోవడం దారుణమని ధ్వజమెత్తారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు సామాన్యుల ఇళ్ల ను కూల్చివేస్తూ ప్రభుత్వం బడు గు జీవుల ఉసురు పోసుకుంటోందన్నారు. ఖమ్మంలో ఇంటికో డీసీఎం పంపి కూలగొడుతున్నారని ఆయన విమర్శించారు. కూకట్‌పల్లి ఎల్లమ్మ బండ వద్ద 120 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటే పట్టించుకునే పరిస్థితి లేదని ఆక్షేపించారు. 

ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి తక్షణమే ప్రత్యామ్నాయం చూపాలని ఈటల డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏం జరుగుతోందో రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. ఇక్కడి దుర్మార్గాలను ఆపాలి. లేదంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారు అని ఈటల హెచ్చరించారు.