28 June, 2026 | 1:49 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి

17-03-2026 03:24 PM

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో తనకు 4 దశాబ్దాల అనుబంధం ఉందని మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి(Senior Leader Jeevan Reddy ) తెలిపారు. జగిత్యాలో జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కారణమని ఆరోపించారు. తాను తీసుకునే నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉంటుందని వివరించారు. ఆత్మగౌరవం చంపుకుని పార్టీలో ఉండటం సాధ్యమేనా అన్నారు.

పార్టీని వీడటంపై ఆలోచిస్తున్నాని తెలిపారు. ఉగాది తర్వాత మరోసారి ఈ అంశంపై మాట్లాడుతానని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపితే పార్టీ బాగుపడుతోందని ఆయన తేల్చిచెప్పారు. ఇప్పటికైతే ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని వివరించారు.  ఇప్పటికే జగిత్యాలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ అన్నట్లు సాగుతోంది.. నిన్న జగిత్యాలో ప్లెక్సీల వార్ కలకలం రేపింది.