తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల(Telangana HAM Roads) పేరిటి రూ. 18 వేల కోట్ల స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) ఆరోపించారు. హ్యామ్ రోడ్లకు 10 శాతం మొబిలిజేషన్ అడ్బాన్సులు పెట్టారని సూచించారు. హ్యామ్ రోడ్ల ద్వారా కాంగ్రెస్ కు రూ. 1800 కోట్లు వస్తాయని తెలిపారు. హ్యామ్ రూడ్లపై(HAM Roads) కమీషన్లను నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు పంపుతారని హరీశ్ రావు వివరించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీవోటీ అనుమతి.. 5 శాతం సీలింగ్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు(Mobilization Advances) రద్దు చేయాలన్నారు. హ్యామ్ రోడ్ల స్కామ్ పై హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని పేర్కొన్నారు. సీవీసీ, ఆర్బీఐ(Reserve Bank of India) సహా అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




