22 April, 2026 | 2:08 AM

మతం మారితే హక్కులు ఎందుకు పోతాయి?

22-04-2026 12:20 AM
  1. దళిత క్రైస్తవులపై రాజ్యాంగ వివక్ష కొనసాగుతోంది
  2. మాలమాదిగ క్రైస్తవులపై స్పష్టమైన కుల అన్యాయం
  3. మాజీ డీజీపీ డాక్టర్ జే పూర్ణచంద్రరావు

విజయవాడ, ఏప్రిల్ 21: మతం మారినా కులం పోవడం లేదని, కానీ రాజ్యాంగ హ క్కులు మాత్రం కోల్పోతున్నారని మాజీ డీజీపీ, జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే పూ ర్ణచంద్రరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్ కో-ఆర్డినేషన్ కౌన్సిల్ (సీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాల, మాదిగలకు చెందిన దళిత క్రైస్తవులు ఇప్పటికీ అదే అస్పృశ్యత, అదే సామాజిక వివక్ష, అదే ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

మతం మారితే కుల ముద్ర పోవడం లేదు.. కానీ రాజ్యాంగ పరిరక్షణ మాత్రం పోతుంది ఇది ఎలాంటి న్యాయం? అని ఆయన ప్రశ్నించారు. హిందూ, సిక్కు, బౌద్ధ మతా ల్లో ఉన్న దళితులకు ఎస్సీ హక్కులు అందుతుండగా, క్రైస్తవ మతం స్వీకరించిన వారికి అవి నిరాకరించబడడం ఘోర వివక్ష అని విమర్శించారు. ఏ సమస్యకైనా కోటి సంతకాల ఉద్యమాలు చేపట్టే నాయకులు, దళిత క్రైస్తవుల సమస్యపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

పాలక వర్గాల నాయక త్వం అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు. మాలమాదిగల మధ్య విభేదాలు పెంచి బహుజన ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. డిలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అంశాల్లో కేం ద్రంతో కలిసి రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిన తీరు దళితులకు అన్యాయమని అన్నా రు. కమ్మ, రెడ్డి వంటి పైవర్గాలకు చెందిన క్రైస్తవులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రిజర్వేషన్లు పొందుతున్నారని, కానీ దళిత క్రైస్తవు లకు ఎస్సీ హక్కులు నిరాకరించడం ద్వంద్వ విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు.

దేశం లో 56% వర్గాలు శాసనసభల్లో 40 ప్రాతినిధ్యం పొందుతున్నాయని, ఇది సా మాజిక న్యాయానికి విరుద్ధమని తెలిపారు. అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని అవమానించడమేనన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హో దా కల్పించాలని, ఇందుకు 1950 షెడ్యూల్ కాస్ట్స్ ఆర్డర్‌లోని పేరా 3ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ విషయం కాదు రాజ్యాంగ హక్కుల పునరుద్ధరణ అని స్పష్టం చేశారు. ఈ విషయంపై సీసీసీ కార్యాచరణ ప్రణాళిక చేపడుతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన యాత్రలు,ప్రజాప్రతినిధులతో భేటీలు,సుప్రీంకోర్టు స్థాయిలో న్యాయ పోరాటం,బహుజన సంఘాలతో ఐక్యత, సోషల్ మీడియా అండ్ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తుందన్నారు.ఈ సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి ఐ. ఆనం దకుమార్ సామ్యూయేల్,, నాయకులు బి. పరంజ్యోతి, డా. ఎన్‌ఏడీ పాల్ తదితరులు ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సంఘీభావం తెలిపారు.