సీఎం బహిరంగ సభకు ఆమనగల్ బ్లాక్ నుండి భారీగా తరలిన శ్రేణులు
ఆమనగల్,(విజయక్రాంతి): మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రి (సీఎం) భారీ బహిరంగ సభకు శనివారం జనసందోహం పోటెత్తింది. ఆమనగల్ బ్లాక్ పరిధిలోని వివిధ మండలాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు సాధారణ ప్రజలు భారీ సంఖ్యలో మిడ్జిల్ సభకు ప్రత్యేక వాహనాలో తరలివెళ్లారు. సభకు వెళ్లే ముందు, బ్లాక్ పరిధిలోని వివిధ గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలివచ్చి ఆమనగల్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం నాయకులు, జగన్, కేశవులు, మానయ్య జెండా ఊపి ఈ వాహన శ్రేణిని ప్రారంభించగా, కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ మిడ్జిల్ సభా ప్రాంగణానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.






