5 March, 2026 | 8:25 PM

మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు

05-03-2026 05:05 PM

మునుగోడు,(విజయక్రాంతి): పొగాకు నియంత్రణలో మాచన రఘునందన్(Machana Raghunandan) చేస్తున్న కృషి అభినందనీయమనివరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రశంసించింది. గురువారం డబ్ల్యూహెచ్ఓ(World Health Organization) ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆయన సేవలు రాష్ట్రం, దేశం మాత్రమే కాకుండా ప్రపంచ హితం దిశగా కొనసాగాలని ఆకాంక్షించింది. మార్చి 11న నిర్వహించనున్న జాతీయ ధూమపాన వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డబ్ల్యూహెచ్ఓ టుబాకో కంట్రోల్ స్టేక్‌హోల్డర్లతో జూమ్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి రాకేష్ గుప్తా మాట్లాడుతూ,గత 22 ఏళ్లుగా పొగాకు నియంత్రణ కోసం నిరంతరం కృషి చేస్తున్న రఘునందన్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.సమాజంలో ఇలాంటి వ్యక్తులు కోటికొక్కరైనా ఉన్నా ప్రజల్లో అవగాహన పెరిగి ఆరోగ్యకరమైన మార్పు సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.