22 May, 2026 | 3:41 PM

Breaking News

మార్కెట్లో నిండుకున్న జొన్న మొక్కజొన్న పంట   •   బాలల హక్కుల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరం   •   శ్రీ కృష్ణ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు   •   దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం   •   ఎండిన వాగుకు జీవం పోస్తున్న చెక్ డ్యాములు   •   అడ్మిషన్ లు ప్రారంభం.. విద్యార్థినిలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే   •   భాగ్యరెడ్డి వర్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తి   •   మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు   •   మక్కలు వెంటనే తరలించాలని తహసీల్దార్ కు వినతి   •  

ఫైనల్ బెర్త్ ఎవరిదో?

31-01-2025 01:17 AM

నేడు భారత్, ఇంగ్లండ్ సెమీస్ l అండర్ టీ20 ప్రపంచకప్

కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అం డర్ టీ20 ప్రపంచకప్‌లో నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరాలనే పట్టుద లతో ఉండగా.. ఇంగ్లండ్ మాత్రం యంగ్ ఇండియాకు చెక్ పెట్టాలని భావిస్తోంది.

టోర్నీలో ఓటమెరుగని జట్టుగా నిలిచిన భారత్ లీగ్ సహా సూపర్ సిక్స్ వరకు వరుస విజయాలతో దుమ్మురేపింది. నిక్కీ ప్రసాద్ నేతృత్వంలోని జట్టులో బ్యాటింగ్ విభాగంలో గొంగడి త్రిష, కమలిని వెన్నుముకలా నిలుస్తున్నారు. తెలుగు తేజం త్రిష 230 పరుగులతో లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతోంది.

ఇదే జోరు ను ఇంగ్లండ్‌తో సెమీస్‌లోనూ కంటిన్యూ చేస్తే ఆ జట్టుకు కష్టాలు తప్పవు.  బౌలింగ్‌లో వైష్ణవి (12 వికెట్లు), ఆయుషి శుక్లా (10 వికెట్లు) చెరో ఎండ్ నుంచి ఎదురుదాడి చేస్తున్నారు. టోర్నీ ఆరంభం నుంచి భారీ విజయాలే టార్గెట్‌గా పెట్టుకున్న నిక్కీ సేన సెమీస్‌లోనూ ఇంగ్లండ్‌పై అదే జోరు చూపించాలనుకుంటుంది. ఇంగ్లం డ్ బ్యాటర్ పెర్రిన్ 131 పరుగులతో జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా ఉంది.