calender_icon.png 20 February, 2026 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదింటి ఆడబిడ్డ వివాహానికి పెళ్లి కానుక అందించిన మడ్డి సాయికిషోర్ గౌడ్

20-02-2026 05:24:43 PM

పెద్దపల్లి జిల్లా

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి గ్రామానికి చెందిన పేదింటి ఆడబిడ్డ దండవేణి శాంత కుమార్తె దండవేణి సంధ్య వివాహం ఈ నెల 25వ తేదిన ఉండగా విషయం తెలుసుకున్న ఐతరాజుపల్లి యువనాయకులు వైకే ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడ్డి సాయికిషోర్ గౌడ్ వైకే ఫౌండేషన్ సంస్థని ఆశ్రయించి వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30 వేల విలువ గల పెళ్లి బోల్లు ఆ కుటుంబానికి అందజేసి బాసటగా నిలిచారు.

ఈ సందర్బంగా మడ్డి సాయికిషోర్ గౌడ్ శుక్రవారం  మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డ వివాహానికి చేయూత అందించే ఒక గొప్ప అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని అలాగే నేను అడిగిన వెంటనే నాపై నమ్మకం ఉంచి స్పందించి అండగా నిలిచిన వైకే ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసారు.

అనంతరం బోల్లు అందజేసిన సాయికిషోర్ గౌడ్, వైకే ఫౌండేషన్ సభ్యులకు ఆడబిడ్డ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో స్థానిక వార్డు సభ్యులు దాసరి రమ్య రెడ్డి, కొత్తూరి నవతా,  సత్యనారాయణ, ఐతరాజుపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఈర్ల మల్లయ్య, కల్వల కనుకయ్య, గ్రామస్తులు దండవేణి స్వామి, సతీష్, యువకులు అరవింద్, అమరేందర్, నవీన్, శ్రీకాంత్, రాహుల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.