1 August, 2026 | 3:44 PM

స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా 17 పాఠశాలలకు 750 ప్లేట్ల పంపిణీ

01-08-2026 02:38 PM

కల్లూరు,(విజయక్రాంతి): విద్యార్థుల సంక్షేమం కోసం స్ఫూర్తి ఫౌండేషన్ మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. స్థానిక కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 15 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు,అలాగే పెనుబల్లి మండలంలోని వీఎం బంజర్,టేకులపల్లి గ్రామాల ప్రాథమిక పాఠశాలలకు కలిపి మొత్తం 17 పాఠశాలలకు మధ్యాహ్న భోజన సౌకర్యం కోసం 750 ప్లేట్లను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తి ఫౌండేషన్ కల్లూరు కమిటీ సభ్యులు,దాతల సహకారంతో నిర్వహించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు  ఈ ప్లేట్లను అందజేశారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు.భవిష్యత్తులో కూడా విద్యా రంగంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ సహకారానికి స్ఫూర్తి ఫౌండేషన్ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.