1 August, 2026 | 3:41 PM

దుబ్బపల్లిలో మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

01-08-2026 02:43 PM

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొంకురి రామస్వామికి మంత్రి నివాళి

మంథని,(విజయక్రాంతి): మంథని మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొంకురి రామస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి రామస్వామి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఈ క్లిష్ట సమయంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రామస్వామి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేసిన సేవలను మంత్రి శ్రీధర్ బాబు స్మరించుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పూదరి సర్వేష్ గౌడ్, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని రామస్వామికి నివాళులర్పించారు.