1 August, 2026 | 3:42 PM

చీకటిలో దారి చూపేది నేస్తమే

01-08-2026 02:57 PM

బోథ్,(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని వేదం పాఠశాలలో స్నేహితుల దినోత్సవాన్ని విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పచ్చిపాల సంతోష్ మాట్లాడుతూ విద్యార్థుల మధ్య స్నేహభావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రతి విద్యార్థి అందరితో కలిసి స్నేహపూర్వకంగా ఉండాలని చీకటిలో దారి చూపేది స్నేహితుడు మాత్రమేనని పేర్కొన్నారు. స్నేహమంటే ఒకరికొకరు తోడుగా నిలవడం కష్టం సమయంలో చేయూతనివ్వడం ఆనందాన్ని పంచుకోవడం స్నేహం యొక్క విలువ గురించి విద్యార్థులు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్నేహ బ్యాండ్ల మార్పిడి చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.