1 August, 2026 | 3:29 PM

సివై పుల్లయ్యకు కవులు, కళాకారులచే ఆత్మీయ సత్కారం

01-08-2026 03:00 PM

ఖమ్మం,(విజయక్రాంతి): సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన ప్రజా నాయకులు సివై పుల్లయ్య కు కవులు కళాకారుల చే ఆత్మీయ సత్కారం చేశారు. ఖమ్మం నగరంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం సివై పుల్లయ్య, ఝాన్సీ దంపతులను శాలువాలతోసత్కరించి, స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి ఉద్యమం నుంచి ప్రజా ఉద్యమాలకు ఎంతో కృషి చేసి అనేక విజయాలు సాధించారని అభినందనలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి ఐనాల సైదులు, ప్రకృతి వైద్యులు పిసి వి స్వామి, జానపద యుద్ధనౌక పమ్మి రవి, ప్రజాగాయకుడు పాగి వెంకన్న, సినీ గాయకుడు అలవాల నందు, తెలంగాణ ధూంధాం గాయకులు గోవింద గురువయ్య, సినీ నటులు మిమిక్రీభద్ర, కోలాటం మాస్టర్ శ్రీకాంత్ కన్నా, పెద్దపాక విజయ్, వంగపండు పుల్లారావు, రాందాస్, రంజిత్, అరుణోదయ శ్రీను పాల్గొన్నారు.