1 August, 2026 | 3:43 PM

శ్రీరామ హృదయం కలశం శోభాయాత్ర

01-08-2026 02:55 PM

భీమిని,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని  మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర ప్రయుక్త శ్రీరామ హృదయం కలశాలను శని వారం గ్రామ ప్రజలు పట్టుకొని ఊరేగింపుగా శోభాయాత్ర చేశారు. భీమిని శ్రీ హనుమాన్ ఆలయ పూజారి రాజేశ్వర్ శర్మ మాట్లాడుతూ స్వామివారి దివ్య ఆశీస్సులతో శ్రీరామ హృదయం కలశంను రోజుకి ఒక గ్రామం చొప్పున మండలంలోని ప్రతి గ్రామంలో శోభయాత్రగా తిప్పుతూ శ్రీరాముడి ఆశీస్సులు అందిస్తామని, మండలంలోని ఆయా గ్రామాల ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఇట్టి శోభయాత్రను విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్తులు బెల్లంపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంఘర్ష్ రవీందర్రావు, సంతోష్ కుమార్, బండి అశోక్ గౌడ్, గన్నవరం రవీందర్, గడ్డం శ్రీనివాస్, శంకర్ స్వామి,శ్రీకర్, మోర్ల  బాపు, పసిలోటి రాజన్న మహిళలు గ్రామస్థులు పాల్గొన్నారు.