7 August, 2026 | 4:24 AM

జేఈఈ తరహాలో నీట్!

07-08-2026 12:36 AM
  1. కంప్యూటర్ ఆధారిత విధానం పరీక్షపై కసరత్తు
  2. పెన్- అండ్- పేపర్ విధానానికి స్వస్తి
  3. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక అఫిడవిట్
  4. కేసు ఆగస్టు 19కి వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఏఈఈ (మెయిన్స్, అడ్వాన్డ్స్) తరహాలో నీట్ (యూజీ) పరీక్షను పెన్- అండ్ -పేపర్ విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత విధాన పరీక్ష(సీబీటీ)కు మార్చడంపై చురుగ్గా పరిశీలన జరుగుతోందని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షల నిర్వహణ వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. జేఈఈ పరీక్ష మాదిరిగా నీట్‌కు కూ డా ఆన్‌లైన్‌లో నిర్వహించే అంశంపై విస్తృతంగా కసరత్తు జరుగుతోందని తెలిపింది.

దీనిపై స్పందించాలని కోరుతూ, వైద్యుల సంఘంతో సహా పిటిషనర్లను సుప్రీంకోర్టు గురువా రం ఆదేశించింది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్‌అరధేతో కూడిన ధర్మాసనం, ఈ అంశాన్ని ఆగస్టు 19న విచారిస్తా మని, కేంద్రం దాఖలు చేసిన కౌంటర్- అఫిడవిట్‌పై పిటిషనర్లు తమ సమాధానాలను దాఖలు చేయవచ్చని పేర్కొంది. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్‌ఏఐ ఎంఏ) తరఫున హాజరైన న్యాయవాది తన్వి దూబే ధర్మాసనానికి ఒక విషయాన్ని వివరించారు.

ఒకవేళ కంప్యూటర్ ఆధారిత విధానానికి మారే ప్రణాళిక ఉంటే, అది వీలైనంత త్వరగా జరగాలని ఆమె కోరారు. ఎందుకంటే ప్రస్తుతం విద్యార్థుల సన్నద్ధత పెన్- అండ్- పేపర్ విధానం ఆధారంగానే సాగుతోందని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసు కుంటా మని చెప్పిన ధర్మాసనం, సంబంధిత పక్షాలను తమ సమాధానాలు, సూచన లను దాఖలు చేయాలని కోరింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో సంస్కరణలు కోరిన ఆర్‌జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ తరఫున సీనియర్ న్యాయవాది పిజుష్ కాంతిరా య్, న్యాయవాది సత్యం సింగ్ రాజ్పుత్ హాజరయ్యారు. నీట్ విషయంలో, పెన్- అండ్- పేపర్ విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత విధానానికి మారడం (ఇది జా యింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ -మెయిన్స్, అడ్వానస్డ్ తరహాలో ఒకే దశలో లేదా రెండు దశల్లో ఉండవచ్చు) అనే అంశంపై ప్రస్తుతం సంబంధిత వర్గాలన్నీ చురుగ్గా పరిశీలన జరుపుతున్నాయని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

‘నందన్ నీలేకని నేతృత్వం లోని ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది విధానాన్ని అనుసరిస్తామని భారత ప్రభు త్వం గౌరవపూర్వకంగా తెలియజేస్తోంది.. సాంకేతికత, అంతరిక్షం, ఇంటెలిజెన్స్, విద్యా రంగం, ప్రజాపరిపాలన వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణులతో కూడిన ఈ టాస్క్ ఫోర్స్, విధాన మార్పుకు సంబంధించిన సాంకేతిక, భద్రతా, సమానత్వ, మౌలిక సదుపాయాలు, బోధనాపరమైన అంశాలను సమగ్రంగా, క్షుణ్ణంగా పరిశీలించేలా చేస్తుంది’ అని కేంద్రం పేర్కొంది.

ప్రశ్నపత్రాల లీకులు, వ్యవస్థాగత వైఫల్యాలను ని ర్మూలించేందుకు జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణలో సమగ్ర మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్య త్తులో నీట్ పరీక్షలను ఎలా నిర్వహిస్తారు, రాబోయే సంవత్సరాలలో పరీక్షా ప్రక్రియలను మెరుగుపరచడానికి నియంత్రణ సంస్థ లు సంస్థాగతంగా ఎలా నిర్మించి, నిలుపుకుంటాయో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మే 29న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి ప్రతిస్పందనగా ఈ అఫిడవిట్ దాఖలు చేయబడింది.

ప్రశ్నాపత్రాల లీకు లు, నకిలీ గుర్తింపు, కంప్యూటర్ వ్యవస్థలను తారుమారు చేయడం, ఇతర పరీక్షా సంబంధిత నేరాలను నేరంగా పరిగణించిన 2024 చట్టాన్ని విస్తరిస్తూ, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ చట్టం, 2026 ద్వారా పరీక్షల మోసానికి వ్యతిరేకంగా పార్లమెంటు చట్టపరమైన వ్యవస్థను మరింత బలోపేతం చేసిందని కేంద్రం తెలిపింది.

నీట్ నిర్వహణకు బాధ్యత వహిస్తున్న ఎన్టీఏ స్థానంలో, వైద్య ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి ఒక పటిష్టమైన, స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని లేదా పునర్నిర్మిం చాలని పిటిషన్‌లో ఒకటి కోరింది. కేంద్రం సమర్పించిన వివరాలపై తమ సమాధానాలు దాఖలు చేయాలని పిటిషనర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. అన ంతరం జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఆగస్టు 19కు వాయిదా వేసింది.