18 July, 2026 | 12:24 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

కులగణన సర్వే డబ్బులు ఏమాయే!?

24-03-2026 12:00 AM
  1. ఏడాది గడిచినా ఊసే లేదు. 
  2. విడుదలకు నోచుకోని 1.93 కోట్లు, 
  3. ఎన్యూమరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అసంతృప్తి

నాగర్ కర్నూల్ మార్చి 23 ( విజయక్రాంతి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన కుటుంబ సర్వేలో పనిచేసిన ఎన్యూమరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు పారితోషికం చెల్లింపుల్లో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. గతేడాది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల పాటు నిర్వహించిన కుల గణన సర్వే అనంతరం డేటా ఎంట్రీ వరకు పనిచేసిన ఎన్యుమరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రభుత్వం చెల్లించాల్సిన పారితోషకం కోసం ఎదురుచూపు తప్పడం లేదు.

ప్రభుత్వ నిర్దేశించిన సమయానికి పూర్తిచేయాలని తీవ్ర ఒత్తిడికి గురిచేసిన అధికారులు వారికి పారితోషకం చెల్లింపుల విషయంలో తీవ్ర అలసత్వం వహిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా అధికార యంత్రంపై మండిపడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ సర్వే చేసిన పత్రాలను స్వతహాగా కొంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేసుకొని మరి పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం వారిని గుర్తించ లేదని మండిపడుతున్నారు.

కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్, పుట్టిన తేదీ, విద్య పలు వ్యక్తిగత, కుటుంబ ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన వంటి 60 ప్రశ్నలతో ఒక్కోక్క ఎన్యూమరేటర్ 150 ఇళ్లు సర్వే చేసే ఆన్లైన్లో వివరాలను పొందుపరిచారు. సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఆదివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో కూడా పని చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఒత్తిడి మేరకు జిల్లా యంత్రాంగం కూడా సంబంధిత ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి గురిచేస్తూ సర్వే పూర్తి చేశారు.

ఇంతవరకు బాగానే ఉన్నా సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులు డాటా ఎంట్రీ ఆపరేటర్ల వివరాలను ప్రభుత్వానికి నమోదు చేయడంలో జిల్లా యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది వాటి కారణంగానే నేటికీ పారితోషకం అందడం లేదని మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1717 మంది ఎన్యూమరేటర్లు ఒక్కొక్కరికి 150 ఇండ్ల చొప్పున సర్వే పనుల్లో పాల్గొనగా, వారికి ప్రభుత్వం విడుదల చేయాల్సిన మొత్తం రూ.1.93 కోట్ల నిధులు ఇప్పటికీ అందలేదు.

సర్వే డేటాను నమోదు చేసిన 16 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేయగా, వారికి రూ.76,305 చెల్లించాల్సి ఉంది. సర్వే సమయంలో ఉపాధ్యాయులపై అధికారులు ఒత్తిడి చేసి పనులు చేయించినప్పటికీ, ఇప్పుడు చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఎన్యూమరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.