18 July, 2026 | 12:01 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

కేసులకు భయపడం.. ప్రజల పక్షాన నిలబడుతాం

24-03-2026 12:00 AM

రెండు రోజుల్లో రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించకపోతే మేమే గుంతను పూడ్చేస్తాం

మాజీ మంత్రి రామన్న

ఆదిలాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): తమపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనుల కోసం గుంతను తవ్వి వదిలేయడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

రెండు రోజుల్లో పనులను పున:ప్రారంభించాలని, లేకపోతే ప్రజల రాకపోకలకు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తామే ట్రాక్టర్లలో మట్టిని తీసుకువచ్చి గుంత ను పూడ్చి ప్రజల రాకపోకల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందిపడటంతో బీఆర్‌ఎస్ తరఫున సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి తవ్విన గుంత ప్రాంతాన్ని పరిశీలించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు రామన్న మాట్లాడుతూ... భూ సేకరణ చట్టాన్ని అతిక్రమిస్తూ ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రజలను పక్కదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 13న ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి కేవలం ఎలక్షన్ల కోసమే రైల్వే అండర్ బ్రిడ్జి అంటూ గుంతలు తోడే రాజకీయం చేశారని ఆరోపించారు. తక్ష ణం కలెక్టర్ చొరవ తీసుకొని  గుంతలను పూ డ్చి రాకపోకలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యా సం నర్సింగ్ రావు, ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రలాద్, యూనుస్ అక్బాని, సాజిదోద్దీన్, వెనగంటి ప్రకాష్, వెంకటేష్, దమ్మ పాల్, కొండ గణేష్, దాసరి రమేష్ పాల్గొన్నారు,