18 July, 2026 | 12:21 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం

18-07-2026 12:20 PM

నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1 రాకెట్

శ్రీహరికోట: విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. విక్రమ్-1(Vikram-1) రాకెట్ ప్రయోగం విజయవంతం అయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో భారత రోదసీ చరిత్రలో సరికొత్త ఆధ్యాయం మొదలైంది. ఇస్రో నుంచి తొలిసారి ప్రైవేట్ రాకెట్ ప్రయోగించారు. విక్రమ్ -1 రాకెట్ విజయవంతంగా(Vikram-1 rocket mission successful) నింగిలోకి దూసుకుపోయింది.  స్కైరూట్ లాంచ్ కంట్రోల్ సెంటర్ లో సంబరాలు మిన్నంటాయి. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగాన్ని శనివారం "ముందుగా నిర్ణయించిన విధంగా నిలిపివేశారు" (planned hold), అయితే ఈ ప్రక్రియ త్వరలోనే తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

స్కైరూట్ ఏరోస్పేస్(Skyroot Aerospace) రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ఉదయం 11:30 గంటలకు నింగిలోకి ఎగరాల్సి ఉంది. నావిగేషన్ సమస్యల కారణంగానే ఈ ప్రక్రియ నిలిపివేయబడినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యతో విక్రమ్ ప్రయోగం 35 నిమిషాలు ఆలస్యం అయింది. రాకెట్ ప్రయోగ సమయాన్ని శనివారం మధ్యాహ్నం 12:05 గంటలకు మార్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిస్థితి సమీక్షించి ప్రయోగ సమయాన్ని ఇస్రో, స్కైరూట్ ప్రకటించింది. ఇస్రో నుంచి తొలిసారి ప్రైవేట్ సంస్థ రాకెట్ ప్రయోగం చేస్తోంది. ప్రైవేట్ సంస్థ రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1.