25 July, 2026 | 5:25 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

పేదలకు అండగా సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

11-05-2026 12:56 AM

కోదాడ, మే 10:  ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తోందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి  అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ అండ్ చెక్కుల పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు. ప్రజలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 269 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.89,89,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే ఘనంగా పంపిణీ చేశారు.

ప్రజల కష్టాల్లో ప్రభుత్వం తోడుంటుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నాం. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే మా ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు.అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుం దని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అండగా నిలుస్తున్నాయని చెప్పారు.

మండలాల వారీగా చెక్కుల వివరాలు  అనంతగిరి  40 చెక్కులు,చిలుకూరు  40 చెక్కులు, కోదాడ రూరల్  32 చెక్కులు,కోదాడ టౌన్  32 చెక్కులు, మోతే  56 చెక్కులు మునగాల  42 చెక్కులు, నడిగూడెం  27 చెక్కులు, మొత్తంగా 269 మంది లబ్ధిదారులకు రూ.89.89500 లక్షల రూపాయలను అందజేశారు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, కోదాడ మండల పార్టీ అధ్యక్షుడు తు వరప్రసాద్ రెడ్డి, మునగాల మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, అనంతగిరి మండల అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్ రెడ్డి,  నడిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు  బూత్కూరి వెంకటరెడ్డి,  పులి సులోచన రావు, గుర్రం నీలిమ గాంధీ, తుమాటి నాగిరెడ్డి , తదితరులు పాల్గొన్నారు