14 May, 2026 | 5:47 PM

తర్లపాడు అటవీ ప్రాంతంలో మహిళా మృతదేహం లభ్యం

14-05-2026 04:30 PM

పకడ్బందీగా దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యుల వినతి

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో మహిళ బొమ్మెన మౌనిక( 30 )మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా సంచలనం రేపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖానాపూర్ మండలానికి చెందిన బొమ్మిన మౌనికను మామడ మండలం లింగంపల్లి గ్రామానికి ఏడాదిన్నర క్రితం పెళ్లిచేసి ఇవ్వగా గత శనివారం అత్తవారింటి నుంచి ఖానాపూర్ కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరినట్లు భర్త ఫోన్ చేసి చెప్పాడని కాగా అప్పటినుంచి ఆమె ఆచూకీ లభ్యం కాకపోగా మామడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, చుట్టుపట్ల బంధువుల వద్ద జాడ వెతికిన దొరకకపోగా గురువారం మండల తర్లపాడు గ్రామ అడవి ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నిరవుతున్నారు. ఆమె సోదరుడు బొమ్మన రాజ్ కుమార్ కేసు నిష్పక్షపాతంగా విచారించాలని పోలీసులను కోరారు. కాగా స్థానిక సీఐ అజయ్ ,ఎస్సై రాహుల్ గైక్వాయిడ్లు సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.