అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
14-05-2026 04:24 PM
నిర్మల్ మే 14 ( విజయ క్రాంతి):నిర్మల్ పట్టణంలోనీ శాంతినగర్ కేజీబీవీ పాఠశాలలో రూ.38 లక్షలతో అదనపు మౌలిక వసతుల నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఇందులో పాఠశాల ప్రహారీ గోడ, టాయిలెట్స్ నిర్మాణం చేపట్టనునట్టు తెలిపారు. విద్యారంగబివృద్ధికి అవసరమైన మేర కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇ గంగాధర్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్ , సుంకరి సాయి, పట్టణ బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజీ నరేష్, జింక సూరి, అర్జున్,శాంశంక్, నాయకులు జమాల్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.






