14 May, 2026 | 5:47 PM

విద్యార్థి ఎదుగుదలకు డిగ్రీ ప్రామాణికం

14-05-2026 04:28 PM

నిర్మల్ మే 14 (విజయక్రాంతి): ఏ విద్యార్థి అయినా ఎదుగుదలకు డిగ్రీ ప్రధానం మూలమని కార్మిక శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కె ముత్యం రెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ అన్నారు. గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పిటిఏ సమావేశంలో పాల్గొన్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువులు చదివిన ఎందరో మంది విద్యార్థులు నేడు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని గుర్తు చేశారు.

డిగ్రీ విద్య ఆ విద్యార్థికి ఎంతో కీలకమైందని ఏ ఉద్యోగం సాధించాలన్న ఇది ప్రామాణికంగా ఉంటుందని గుర్తు చేశారు. ఇది కళాశాలలో తాను కూడా చదివి ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులుTGOs President డాక్టర్ పి జి రెడ్డి, జిల్లా కార్యదర్శి ధాత్రిక రమేష్ , రమేష్ రెడ్డి లతో పాటు కళాశాల అధ్యాపకులు సూర్య సాగర్, జాకీర్ హుస్సేన్,రమేష్ , డాక్టర్  శ్రీనివాస్, సుభాష్, అర్చన , డాక్టర్ రజిత, పవన్, ఉమేష్,  aafreen, దిలీప్, నరేందర్,రవీందర్, డాక్టర్  రంజిత్ , బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.