ఏసీబీ వలలో వరంగల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
హైదరాబాద్: వరంగల్(Warangal) జిల్లా దుగ్గొండి మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా(Warangal Revenue Inspector Caught) పనిచేస్తున్న జి. రాంబాబును ఒక ఫిర్యాదుదారుడి నుంచి రూ. 10,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించిన ఆరోపణలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau) గురువారం అరెస్టు చేసింది.
క్షేత్ర విచారణ నిర్వహించడానికి, వరంగల్ జిల్లా దుగ్గొండి తహశీల్దార్‌కు క్షేత్ర పరిశీలన నివేదికను సమర్పించడానికి, అలాగే ఫిర్యాదుదారుని పూర్వీకుల ఆస్తికి సంబంధించి మ్యుటేషన్ చేయించుకోవడానికి దుగ్గొండి మండలం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లంచం డిమాండ్ చేశారు. అవినీతి అధికారి నుండి రూ. 10,000 లంచపు సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ప్రయోజనం పొందే ఉద్దేశంతో అధికారి తన విధులను సక్రమంగా కాకుండా, నిజాయితీ రహితంగా నిర్వర్తించారని ఏసీబీ అధికారులు తెలిపారు.






