పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు
- సుమారు 40వేల విలువగల దుప్పట్లు,ఇతర సామాగ్రి పంపిణి
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని “మా అభాగ్యుల” వృద్ధాశ్రమంలో ఆదర్శప్రాయమైన సేవా కార్యక్రమం నిర్వహించారు. చికోడు గ్రామానికి చెందిన కరెడ్ల తిరుమల రెడ్డి దంపతుల కుమారుడు నవీన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అవసరమైన సామగ్రిని అందజేస్తూ దాతృత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని నివాసితులకు సుమారు రూ.40వేల విలువైన దుప్పట్లు, టవెల్లు, ప్లేట్లు, గ్లాసులు, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వృద్ధుల ఆశీర్వాదాలు తీసుకుని వారి ఆరోగ్యం, యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు మల్లు నర్సాగౌడ్ మాట్లాడుతూ... పుట్టినరోజులను ఆడంబరంగా జరుపుకోవడం కంటే సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని అభినందించారు.






