ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా నాయక్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
14-08-2026 06:36 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా నాయక్ ను మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించినట్లు 297, 298వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు ముదిరాజ్ (చాపరాజు),రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాపరాజు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందరికీ అందించాలని ఆయన స్పష్టం చేశారు.






