14 August, 2026 | 7:11 PM

పారిశుద్ధ్య కార్మికులకు నూతన దుస్తులు పంపిణీ

14-08-2026 05:51 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ నూతన దుస్తులు అందజేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం కార్యాలయంలో సిబ్బందికి నూతన దుస్తులు అందజేశామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ షోయబ్ హుస్సేన్ ,కౌన్సిలర్లు బొప్పారపుపు సత్యవతి,తొడసం ఇందిరా, కమిషనర్ సుందర్ సింగ్, నాయకులు ప్రకాష్ గౌడ్ ,మేష సతీష్, బొప్పారపు రాజ్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు.