జడల్ జమానాకు స్వాగతం!
నేచురల్ స్టార్ నాని పాన్ వరల్డ్ స్పెక్టాకిల్ ‘ది ప్యారడైజ్’. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఒక్కో అప్‌డేట్ వస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఎస్‌ఎ ల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తుండగా, కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సోనాలి కులకర్ణి, సంపూ ర్ణేశ్‌బాబు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఇదిలావుంటే, ఈ చిత్రం నుంచి తాజాగా మరో ప్రధాన పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఇందులో ‘విక్రమ్ మాలిక్’ పాత్రలో నటిస్తున్న రాఘవ్ జుయాల్ ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. రాఘవ్ పూర్తిగా రా, డేంజరస్, భయానకమైన వ్యక్తిత్వం ఉన్న అవతార్‌లో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. హీరో నాని ఈ గ్లింప్స్ చివరలో విక్రమ్ మాలిక్‌ను ‘జడల్ జమానా’ ప్రపంచంలోకి ఆహ్వానించే సన్నివేశం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యం వహిస్తుండగా, చాయ్ సాయి సినిమాటోగ్రఫీని, నవీన్ నూలి ఎడిటింగ్‌ను, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 21న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది.






