ఆదివాసీల హక్కులు, అభివృద్ధి కోసం సమన్వయంతో కృషి చేస్తాం..
ప్రజాప్రతినిధులు, అధికారులు
ఉట్నూర్, ఆగస్టు 9 : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్లో పీఎంఆర్సీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుక లను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ ప్రజలు, నాయకులు, వి ద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్య లో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీ భవనం నుంచి కేబీ కాం ప్లెక్స్ వరకు ఆదివాసీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.
సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం కేబీ కాంప్లెక్స్లోని కొమురం భీం విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ నాయ కులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా జిల్లా ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహా జన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు,
ఏఎస్పీ రిత్విక్ తదితరులు హాజర య్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, కళలు, జీవన విధా నాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివి ధ స్టాళ్లను ముఖ్య అతిథులు, అధికారులు సందర్శించారు. ఆదివాసీల సాంప్రదాయ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఇప్ప పువ్వు లడ్డూ స్టాల్, హస్తకళల స్టాళ్లను సందర్శించి ఉత్పత్తుల తయారీ విధానం, వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ కళ లు, సంప్రదాయ ఉత్పత్తులకు మరింత ప్రో త్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న ఆదివాసీ ప్రజలు తమ ప్రాం తాల్లో నెలకొన్న వివిధ సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువ చ్చారు. ముఖ్యంగా విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, తాగునీరు, మౌలిక వసతు లు, పోడు భూములు, అటవీ హక్కుల చట్టం (RoFR) తదితర అంశాలపై తమ సమస్యలను వివరించారు. ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా-వైద్య సేవల మెరుగుదల, తాగునీరు, విద్యుత్, ర హదారుల వంటి సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలి...
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఆదివాసీ కళలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ వాటికి మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించి వారి వి ద్యాభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరం గా ఉండి విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వైపు దృష్టి సారించాలని సూచించారు.
క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కారం
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా కోకో క్రీడలో ప్రతిభ కనబరిచిన వి ద్యార్థులను ఐటీడీఏ తరఫున శాలువాలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ క్రీడల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అధికారులు తెలిపారు.అనంతరం విద్యార్థులు నిర్వహించిన ఆటపాటలు, సాంస్కృ తిక కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు ఆసక్తిగా తిలకించారు.
ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ని లిచాయి.విద్యార్థులు, ఆదివాసీ కళాకారులు, నాయకులు నిర్వహించిన సంప్రదాయ నృ త్యాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు తదితర అధికారులు, ఆదివాసీ నాయకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో కేబీ కాంప్లెక్స్ ప్రాంగ ణం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ నృ త్యాలతో సందడిగా మారింది.
ఈ సందర్భం గా అధికారులు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కేవలం వేడుకలకు పరి మితం కాకుండా ఆదివాసీల హక్కులు, అభివృద్ధి, సంక్షేమం, సంస్కృతి పరిరక్షణపై మ రింత అవగాహన కల్పించే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. ఆదివాసీ ప్రజల సమ గ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో వివిధ శాఖల అధికారులు, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఆదివాసీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






