రూ.2.16 కోట్లతో నియోజకవర్గంలో రోడ్ల రూపురేఖలు మారుస్తాం
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, జూన్ 17 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రజా సౌకర్యార్థం మట్టి రోడ్లన్నింటినీ సీసీ రోడ్లుగా మారుస్తామని ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన రూ. 2.16 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు అధికారులతో కలిసి భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని డివిజన్ 120 మరియు 122 పరిధిలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, మట్టి రోడ్ల స్థానంలో నాణ్యమైన సీసీ రోడ్లను నిర్మించి ప్రజల రవాణా ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సురేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






