11 April, 2026 | 2:03 AM

మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం

11-04-2026 12:04 AM

ఎమ్మెల్యే యెన్నం ఆలోచనలతో అభివృద్ధి 

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తాం 

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్నగర్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోనిప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వ హించిన మెగా మెడికల్ క్యాంపు, స్వచ్చంద రక్తదాన శిబిరాన్ని, పాత పాలమూరులోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన డిజి టల్ హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ మహిళల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలకు 32 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో ముందు చూపుతో నగరాన్ని మరిం త అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు. జిల్లాను దక్షిణ తెలంగాణ వైద్య రంగానికి కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

మెడికల్ కాలేజ్లో సీట్ల పెంపు, పీజీ కోర్సుల విస్తరణ, విద్యార్థులకు వేర్వేరు హా స్టల్ సదుపాయాలు, ఆడిటోరియం నిర్మా ణం వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కొత్త హాస్పిటల్ భవనం పనులు త్వరలో పూర్తిచేసి, జూన్ నెలలో ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టీచింగ్ హాస్పిటల్ ప్రారంభంతో పాటు హాస్టల్స్, ఆడిటోరియం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజ్, ఆసుప త్రికి అవసరమైన అదనపు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పూర్తిగా సమకూర్చు తుందని స్పష్టం చేశారు.

మహబూబ్నగర్ను సూపర్ స్పెషాలిటీ మెడికల్ హబ్గా అభివృ ద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దక్షిణ తెలంగాణలోని నారాయణపేట్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు మహబూబ్నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెఫరల్ సెంటర్గా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎంఆర్‌ఐ వంటి ఆధునిక వైద్య సదుపాయాలను స్థానికంగా అందుబాటులోకి తీసుకురావడం, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ రిట్రీవల్ సెంటర్, వాస్క్యులర్ యాక్సెస్ సెంటర్ వంటి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. మెడికల్ కాలే జ్లో ప్రస్తుతం ఉన్న విభాగాలకు అదనంగా మరో 14 డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి, ము ఖ్యంగా సర్జికల్ విభాగాలను బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.

టీచింగ్ ఫ్యాక ల్టీ కొరతను తీర్చేందుకు భారీగా నియామకాలు చేపడుతున్నామని, ఇప్పటికే అసిస్టెం ట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, విద్యార్థులకు మెరుగైన మెడికల్ ఎడ్యుకేషన్ అందించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల అభివృద్ధి, అవసరమైన హ్యూమన్ రిసోర్సుల సమీకరణలో మంత్రి తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు.

ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న వైద్య సమస్యలను పరిష్కరిం చేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్లో మెడికల్ కాలేజ్ స్థాపనను ప్రస్తావిస్తూ, ఈ ఆసుపత్రికి మంత్రికి ఏదో సంబంధం ఉందన్నారు.  తాను గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీ డికె అరుణ మంత్రిగా ఉండేవారు ఆ సమయంలో మెడికల్ కాలేజ్ అవసరాన్ని పలు మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఆ సమయంలో సంబంధిత మంత్రి త్వ శాఖతో చర్చలు జరిపి, ప్రపోజల్స్ను ముందుకు తీసుకెళ్లడంలో నాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ కీలక పాత్ర ఉందని వివరించారు. మంత్రి చొరవతోనే మహబూబ్నగర్లో మెడికల్ కాలే జ్ మరియు ఆసుపత్రి ఏర్పాటుకు దారి తీసిందని, దీంతో స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చా యని అన్నారు. మహబూబ్నగర్. ప్రాంత అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న మంత్రి కి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు, జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీమతి హరిప్రియ, జా యింట్ కలెక్టర్ (లోకల్ బాడీస్) మధుసూదన్ నాయక్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, 45 వ డివిజన్ కార్పొరేటర్ సల్మాన్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, డాక్టర్ సామ్యెల్, సాదతుల్లా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.