17-02-2026 12:20:56 AM
ముషీరాబాద్, ఫిబ్రవరి16 (విజయక్రాం తి): టీఆర్టిలో మంచినీటి సరఫరాలో ప్రెషర్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని గాంధీనగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఎ.పా వని వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్‌కుమార్, స్థానికులు, బీజేపీ నేతలతో కలసి టీఆర్టి కమ్యూనిటీ హాల్ వీధి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.
వాటర్ వరక్స్ వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్ అక్కడికి చేరుకొని సమస్య వివరాలను సేకరించారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో వుంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటామని మాజీ కార్పొరేటర్ పావని వినయ్‌కు మార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, మురళీ పాల్గొన్నారు.