calender_icon.png 20 February, 2026 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ నిర్మించాలి

17-02-2026 12:22:16 AM

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం డిమాండ్

ఎల్బీనగర్, ఫిబ్రవరి16: బేగంపేట్, రామంతాపూర్ లోని పబ్లిక్ స్కూళ్లలో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ప్రభుత్వమే శాశ్వత హాస్ట ల్ భవనాలు నిర్మించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ కోశాధికారి  డాక్టర్ భట్టు వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్‌కి చెందిన భట్టు వెంకన్న మాట్లాడుతూ...

రామంతాపూర్, బేగంపేట ప్రాంతాల్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో గిరిజన బాలబాలికల కోసం శాశ్వత హాస్టల్ భవనాలు నిర్మించి, ప్రస్తుతం హాస్టల్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీని తొలగించి ప్రభుత్వమే ప్రత్యక్షంగా హాస్టల్ నడపాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు శంకర్ నాయక్, నందు నాయక్, సంతోష్ నాయక్, గణేష్, దయాకర్, భూక్య వెంకన్న, వినోద్, యాదగిరి, తిరుపతయ్య, అంజయ్య నాయక్, చందులాల్ నాయక్, రాంబాబు పాల్గొన్నారు.