ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
నిజాంసాగర్ జూలై 11(విజయక్రాంతి): పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం నాడు నిజాంసాగర్ మండల కేంద్రంలో బంజపల్లి, మాగీ, వడ్డేపల్లి, మల్లూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తోందన్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు వైద్య చికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందని పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నిరంతర సహకారం, ప్రత్యేక చొరవతో నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు త్వరితగతిన మంజూరై, అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకం పారదర్శకంగా చేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి, సంబంధిత గ్రామాల సర్పంచులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






