11 July, 2026 | 2:06 PM

Breaking News

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •  

తల్లిగా మారిన కానిస్టేబుల్ శివాని

17-02-2026 12:20 AM

పెబ్బేరు పిబ్రవరి 16: పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో మానవత్వం చాటిన మహిళా కానిస్టేబుల్ శివాని ఓ చిన్న మానవత్వ క్షణం అందరి హృదయాలను తాకింది. మున్సిపాలిటీ కేం ద్రంలో 5 వార్డు కౌన్సిలర్గా ఎన్నికైన భాగ్యలక్ష్మి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన వేళ, అ క్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ శివాని చూపిన సేవా భావం అందరినీ ఆకట్టుకుంది. ప్రమాణస్వీకారానికి వచ్చిన ఒక చిన్నారి తన తల్లితో కలిసి కార్యక్రమానికి హాజరైంది.

సభలో జనసమ్మర్థం, కోలాహలం మధ్య చిన్నారి అసౌకర్యంగా ఉండటాన్ని గమనించిన కానిస్టేబుల్ శివాని, విధుల్లో ఉన్నప్పటికీ మానవత్వాన్ని ముందుకు తెచ్చారు. ఆ చిన్నారిని ఆ ప్యాయంగా ఆలింగనం చేసి, కొద్దిసేపు ఆదరిస్తూ తల్లికి సహాయం చేశారు. ఈ దృశ్యం అక్కడు న్న వారిని కదిలించింది. పోలీసు విధుల్లో కఠినత్వం మాత్రమే కాకుండా, మానవత్వం కూడా ఉంటుందనే విషయాన్ని శివాని తన చర్యతో చాటిచెప్పారు. ప్రజల భద్రతే కాకుండా, వారి భావోద్వేగాలకు కూడా అండగా నిలబడగలమని నిరూపించారు.