పొలం పల్లి గ్రామం లో హనుమాన్ జండా ఆవిష్కరణ
చేగుంట జూలై 11,విజయక్రాంతి: చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయంలో హనుమాన్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమాన్ జండా ఆవిష్కరణ నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి .భక్తులతో కలిసి హారతులు ఇచ్చి, ప్రాంత ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,హనుమంతుడు భక్తి, బలం, సేవకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, ధార్మిక చైతన్యం పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కర్రే రాజు, కార్యదర్శి యట గణేష్, ప్రధాన కార్యదర్శి యట శివకుమార్, కోశాధికారి యట బాల కృష్ణ,సభ్యులు టీ భాస్కర్, చంద్రశేఖర్ గౌడ్, గణేష్, ఆనంద్, శ్రీకాంత్,స్థానిక నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు, భక్తులు,పాల్గొన్నారు..






