11 July, 2026 | 1:00 PM

అక్రమంగా మొరం తవ్వకం.. జేసీబీ, టిప్పర్ సీజ్

11-07-2026 11:51 AM

బోధన్,జూలై 11(విజయ క్రాంతి): నవీపేట్ మండలం అభంగపట్నం శివారులో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై శ్రీకాంత్ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ధర్మారం గ్రామానికి చెందిన సూర నర్సయ్యకు చెందిన జేసీబీ, టిప్పర్ను స్వాధీనం (సీజ్) చేసుకున్నట్లు చెప్పారు. సూర నర్సయ్యతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.