30 May, 2026 | 1:04 AM

సచివాలయ గోడలు బద్దలు కొడుతాం

30-05-2026 12:17 AM
  1. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలేదీ?
  2. నెరవేర్చకుంటే ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తాం
  3. కలెక్టరేట్ల ముందు నిరసనలు చేపడుతాం
  4. విద్యార్థులను ఏకం చేసి పోరాడుతాం
  5. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే
  6. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, లేదంటే సచివాలయ గోడలు బద్దలు కొట్టునా హక్కులను సాధించుకుంటామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తామని, కలెక్టరేట్ల ముందు నిరసనలు చేపడుతామని హెచ్చ రించారు.

గణేష్ కుండే ఆధ్వర్యంలో కార్యకర్తలు శుక్రవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ఘ న నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతను మోసం చేస్తూ, నిరుద్యోగ యు వత ఆశలను కాంగ్రెస్ వమ్ము చేస్తున్నదన్నారు. విద్యారంగానికి కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ద్రోహం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత కీలక పాత్ర పోషించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగాల భర్తీ, నిరు ద్యోగ భృతి, ఫీజురీయింబర్స్‌మెంట్, యువతకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు వంటి హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలేమయ్యాయని ప్రశ్నిం చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, యువతులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. సచి వాలయ గోడలు బద్దలు కొట్టునా తమ హక్కులను సాధించుకుంటామని, విద్యార్థులను ఏకం చేసి పోరాడుతామన్నారు.

ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించారు. విద్యా సమస్యలపై జిల్లా కలెక్టర్లకు వినతిప త్రాలు ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శులు గావినోళ్ల హరిశ్వర్‌రెడ్డి, మల్కా యశస్వి, ఉపాధ్యక్షలు ప్రవీణ్‌రెడ్డి, సందీప్ గౌడ్, నితిన్, అనితరెడ్డి, శరత్‌చంద్ర, సాయినాథ్, కార్యదర్శలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లానాయకు లు పాల్గొన్నారు.

బీజేవైఎం కార్యాచరణ

1. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులతో రౌండ్ టేబుల్ సమావేశాలు

2.ప్రతి మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరస న దీక్షలు

3. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడులు

4. కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు

5.మంత్రుల కార్యాలయాల ముట్టడులు

6. చలో తెలంగాణ సచివాలయం కార్యక్రమం