30 May, 2026 | 1:34 AM

సబ్ స్టేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్ల లోడింగ్ పెంపు

30-05-2026 12:17 AM

ఎల్బీనగర్, మే 29 : వేసవిలో విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో ఓవర్ లోడ్ తో ట్రాన్స్ ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. సరూర్ నగర్ డివిజనల్ ఆపరేషన్ సర్కిల్ లో ట్రాన్స్ ఫార్మర్ల పవర్ లోడ్ పెంచుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ లోని 33/11 కేవీ సబ్ స్టేషన్ లో అధిక లోడుకు అనుగుణంగా ట్రాన్స్ ఫార్మర్ల మార్చారు. 

8 MVA పవర్ ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో 12.5MVA పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి, పవర్ లోడ్ పెంచారు. ఈ కార్యక్రమంలో  ప్రొటెక్షన్ డీఈ హేమానంద్,  సరూర్ నగర్ ఆపరేషన్ డీఈ  ఫర్హాత్ అలీ,  సరూర్ నగర్ లైన్స్ డీఈ వేణుగోపాల్, ఏడీఈలు హనుమంతు, రాములు, ఉదయ్ కుమార్, ఏఈలు రవికుమార్, పూర్ణచంద్రరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.