రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించండి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
హనుమకొండ అర్బన్, మే 29 (విజయక్రాంతి): చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, సాధరణ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరించే రౌడీ షీటర్ల పట్ల అణిచివేత ధోరణీతో వుండాలని వరంగల్ పోలీ స్ కమిషనర్ అధికారులను అదేశించారు. కిట్స్ కళాశాలలో శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్వర్యంలో నేర సమీక్షా స మావేశం నిర్వహించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన పోలీస్ అధికారులు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా శాంతి భద్రతలకు సంబం ధించి అంశాలను ప్రస్తావిస్తూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు నిర్వహించే కౌన్సిలింగ్లో వంద శాతం రౌడీ షీటర్లు అందరు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి నెల ఒకమారు స్టేషన్ అధికారులు వ్యక్తిగతంగా రౌడీ షీటర్ల ఇండ్లను సందర్శించి వారిని తనఖీ చేయాల్సి వుంటుందన్నారు.
నేరాల నియంత్రణలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి సమయాల్లో బెల్ట్ షాపులను ఊయించాలని, అలా చేయకుంటే వారిపై కేసులు నమోదు చేయడం లేదా బైండోర్ చేయాలని, నిర్ణీత సమయాల్లో షాపులను మూయించాల్సిన బాధ్యత సంబంధిత స్టేషన్ అధికారిపై వుందన్నారు. రాత్రి సమయాల్లో అధికంగా రద్దీ వుందే ప్రాంతాలను గుర్తించి అక్కడ ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇకపై రాత్రి సమయాల్లో ఎవరైన రోడ్లపై జన్మదిన వేడుకలు జరుపుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చోరీల కట్టడికై ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇండ్లతో పాటు ఇతర వ్యాపార సంస్థల్లో పనులు చేసే వారి వివరాలతో పాటు హస్టల్స్ నిర్వహణకు సంబందించిన వివరాలు సైతం స్థానిక పోలీసులు సేకరించాలన్నారు.
అధికారుల పని తీరుపై పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేస్తూ ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి తప్పని సరిగా ఉదయం 9 గంటల నుండి ప్రజలకు అందుబాటులో ఉండాలని, నేరస్థుల అరెస్టు విషయంలో అధికారులు నిర్లష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని, ద్విచక్ర వాహనాల చోరీ అయితే వెంటనే దానిపై కేసు నమోదు చేయాలని, క్షేత్ర స్థాయిలో పెట్రొలింగ్ వాహనాల పనితీరును అధికారులు సమీక్షా జరపాలని, మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేస్తే ప్రజలకు న్యాయం చేసినట్లని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
అనంతరం పెండింగ్ కేసులు, నేరస్తుల అరెస్టు, కేసుల్లో కోనసాగుతున్న దర్యాప్తు తీరుతెన్నులు, నేర నియంత్రణకై స్టేషన్ పరిధిలో తీసుకుంటున్న చర్యలతో పాటు, ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకుగా అధికారులు చేట్టిన చర్యలపై పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డిసిపిలు అకింత్ కుమార్, దార కవిత, రాజ మహేంద్ర నాయక్, అదనపు డిసిపిలు రవి, ప్రభాకర్ రావు, బాల స్వామి, సురేష్ కుమార్తో పాటు ఏసిపిలు, ఇన్స్సె్పక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.






