మార్కెట్ యార్డుకు లారీలను పంపిస్తాం.. ఆందోళన చెందకండి: ఎమ్మెల్యే
బోథ్, మే 29(విజయక్రాంతి): ప్రభుత్వం రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన జొన్న పంట మార్కెట్ యార్డుల్లోని నిలిచిపోయిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ శుక్రవారం బోట్ మార్కెట్ యార్డ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నాలుగు రోజులపాటు అందుబాటులో లేనని అయితే వచ్చి రాగానే రైతులు పడుతున్న ఇబ్బందులను తమ పార్టీ నాయకులు తెలపడంతో మార్కెట్ యార్డ్ కు రావడం జరిగిందన్నారు. వర్షం కురిస్తే పంట తడిసిపోవడంతో పాటు పంటను తరలించడం కష్టంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
రైతులు సహనంతో ఉండాలని లారీలను పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు ఎకరానికి ప్రభుత్వం 10:00 గంటల మేరకే కొనుగోలు చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని మరోవైపు . తూకం చేసి నిల్వ ఉంచిన పంట తరలించే వరకు రైతులను బాధ్యులుగా చేయడం వల్ల రాత్రి పగలు రైతులు మార్కెట్లోనే ఉండాల్సి వస్తుందని ఇది సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.ఆయన వెంట ఎంపీడీవో రమేష్ పిఎసిఎస్ చైర్మన్ కదం ప్రశాంత్ అధికారులు మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు స్వామి మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాజీ సర్పంచులు శ్రీధర్ రెడ్డి రాజేందర్ రవీందర్ బాబులాల్ మండల పార్టీ కన్వీనర్ నారాయణరెడ్డి ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు బోత్ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్ విడీసీ అధ్యక్షులు అల్లకొండ పోతన్న రమణ గౌడ్ సభ్యులు ప్రవీణ్ తో పాటు నాయకులు గంగమల్లు రమణారెడ్డి తదితరులు ఉన్నారు.






