12 June, 2026 | 10:53 PM

సీసీఐ కూల్చివేత బీజేపీ పాపమే

12-06-2026 08:41 PM

* డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఎన్నికల అనంతరం ఫ్యాక్టరీని తుక్కు కింద విక్రయించడం ముమ్మాటికి ఇది బీజేపీ ఎంపీ , ఎమ్మెల్యే ల పాపమేనని డీసీసీ డా. నరేష్ జాదవ్ అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ  మోడీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో స్థానిక మున్సిపాలిటీ టెక్స్ బకాయిలు రూ.5 కోట్లు, విద్యుత్ బిల్లు రూ.20 కోట్లు, స్థానిక అర్లి గ్రామ పంచాయతి టెక్స్ బకాయిలు చెల్లించకుండా, స్థానిక ప్రభుత్వాన్ని చట్టాలని గౌరవించకుండా సీసీఐని స్క్రాప్ కి టెండర్లు పిలిచి కూల్చి వేత పనులు ప్రారంభించడం చట్ట విరుద్ధం అక్రమ అన్యాయమని అన్నారు. సిసిఐ ఫ్యాక్టరీ పట్ల బీజేపీ తీరును నిరసిస్తూ శ్రేణులతో కలిసి ఫ్యాక్టరీ ఎదుట నిరసన  వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో , మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డిసిసి సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు  బండారి సతీష్, సంతోష్, సంగీత  కార్యకర్తలు పాల్గొన్నారు.